: కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తం
ఫైలిన్ తుపాను ప్రభావం కృష్టా జిల్లా మీద కూడా అధికంగా ఉంటుందన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాశ్ మచిలీపట్నంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా వాహనాలను సిద్ధం చేశారు.