: బిల్లు పెడితే 'మిలియన్ మార్చ్' తప్పదు: అశోక్ బాబు
పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెడితే సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరమవుతుందని, హైదరాబాదులో 'మిలియన్ మార్చ్' చేపట్టక తప్పదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. హైదరాబాదులో ఏపీ జర్నలిస్టు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం గనుక పార్లమెంటులో విభజన బిల్లు పెడితే మిలియన్ మార్చ్ తోపాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలతో పాటు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని వివరించారు. రాష్ట్ర విభజన జరుగుతుంటే ఎంపీలు కిమ్మనకుండా ఉండడం విచారకరమన్నారు. మున్ముందు తాము ఏ పార్టీకి మద్దతివ్వబోమని స్పష్టం చేశారు.