: సహాయక చర్యలకు నడుంబిగించిన ఎన్టీఆర్ ట్రస్ట్


ఫైలిన్ తుపాను ఈ అర్థరాత్రి తీరం దాటనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాలు సహాయక చర్యలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వీరికి తోడు ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా తుపాను బాధితులకు సాయం చేసేందుకు నడుంబిగించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్రస్ట్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాబు ప్రస్తుతం ఢిల్లీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వందమందిని నాలుగు బృందాలుగా పంపినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో వెంకట్ మోపర్తి వెల్లడించారు. వీరితోపాటు లక్షల విలువైన ఔషధాలు, సామాగ్రి తరలించినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News