: సోనియా ఇంటి ముందు టీడీపీ శ్రేణుల ఆందోళన


ఢిల్లీ ఆసుపత్రిలో అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష కొనసాగిస్తుండగా, తెలుగు తమ్ముళ్ళు సోనియా ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు న్యాయం చేయాలంటూ సోనియా ఇంటి ముందు నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో, భద్రతాసిబ్బంది వారిని అడ్డుకోవడంతో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News