: 'ఫైలిన్' ప్రవర్తన అంతుబట్టడం లేదు!
ఫైలిన్ తుపాను చాలావాటి కంటే విభిన్నమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 73 తుపానులు వచ్చినా వాటికంటే దీని ప్రవర్తన విభిన్నంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైలిన్ తుపాను కడపటి వార్తలందేసరికి ఒడిశాలోని గోపాల్ పూర్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే తుపాను చాలా వేగంగా ప్రయాణిస్తోందని తెలిపారు. ఇంత వేగంగా తుపాను దూసుకొస్తున్నా వాతావరణంలో మాత్రం ఎలాంటి విపరీత మార్పులేదని తుపాను సూచనగా వేగంగా వీచే గాలులు కానీ, ఎగసిపడుతున్న భారీ అలలు కానీ ఊహించినంతలా ఉండడం లేదని, దీని కారణంగా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేకపోతున్నామని నిపుణులు అంటున్నారు. ఈ తుపాను భారీ విధ్వంసాన్ని కలిగించే అవకాశం ఉందని, అలా కాకుండా, ఒక్కసారిగా బలహీనపడే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వచ్చిన తుపానేదీ దీనిలా ప్రవర్తించలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.