: ఫేస్ బుక్ కు కొత్త హంగులు!
ఈ రోజుల్లో... ఫేస్ బుక్ వినియోగం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిందే. స్నేహితులతో తమ కామెంట్లు, ఫొటోలు, వీడియోలు పంచుకునే అవకాశాన్ని ఈ సామాజిక వెబ్ సైట్ సమర్థంగా అందిస్తోంది. ఇప్పటికే 100 కోట్ల మంది వినియోగదారులతో దూసుకుపోతున్న ఫేస్ బుక్.. ఇపుడు వినియోగదారుల కోసం కొత్త న్యూస్ ఫీడ్ (కామెంట్లు, ఫొటోలు, వీడియోలు)ను అందించేందుకు సిద్ధమౌతోంది.
2011 సెప్టెంబరులో ఆఖరిసారిగా ఫేస్ బుక్.. న్యూస్ ఫీడ్ ను అప్ డేట్ చేసింది. ఆ తర్వాత మొబైల్ వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డ ఫేస్ బుక్..తాజాగా కొత్త న్యూస్ ఫీడ్ ను మార్చి 7వ తేదీన కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో లాంఛనంగా విడుదల చేయనున్నారు.