: నా సూచనలను దూషణలుగా భావించవద్దు: జ్వాల


భారత బ్యాడ్మింటన్ సంఘం(బీఏఐ) ఆగ్రహానికి గురైన జ్వాల.. తన సూచనలను దూషణలుగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద జ్వాలపై జీవితకాల నిషేధానికి బీఏఐ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడం, దానిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడం తెలిసిందే. బహిరంగ వ్యాఖ్యల వల్లే ఇలా జరిగిందా? అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. 'బహిరంగంగా మాట్లాడడంలో తప్పేముంది? బహిరంగంగా మాట్లాడితే జీవితకాల నిషేధం విధిస్తారా? ఇది నిజంగా సిల్లీ' అంటూ వ్యాఖ్యానించింది. తానేమీ అబద్ధాలు మాట్లాడడంలేదని చెప్పింది. 'నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. కొన్ని విషయాలపై మాట్లాడడం కూడా తెలియదు. నేనేమైనా వారికి (బీఏఐ) వ్యతిరేకంగా చేస్తున్నానని భావిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. బ్యాడ్మింటన్ ఆడడం తప్ప ఇంకేమీ చేయను' అంటూ ముక్తాయించింది.

  • Loading...

More Telugu News