: ఫైలిన్ తుపానుపై అమెరికా నేవీ హెచ్చరికలు


ఫైలిన్ తుపాను ప్రచండవేగంతో దూసుకొస్తుండగా, ఒడిశా హడలెత్తిపోతోంది. పరిమాణం పరంగా చూస్తే భారతదేశంలో సగం సైజు ఉన్న ఈ తుపాను తీరం దాటితే, వాటిల్లే విపత్తు ఏ స్థాయిలో ఉంటుందోనని ఒడిశాతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలు వణికిపోతున్నాయి. ఈ తుపానుపై అమెరికా నేవీ కూడా ఓ కన్నేసి ఉంచింది. తీరాన్ని దాటేవరకు ఫైలిన్ తుపాను బలహీనపడదని, పెను తీవ్రతతో తీరాన్ని తాకుతుందని అమెరికా నేవీకి చెందిన జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ (జేటీడబ్ల్యూసీ) తెలిపింది. ఫైలిన్ తీరాన్ని దాటే సమయంలో పెను విధ్వంసం తప్పదని హెచ్చరించింది. కుంభవృష్టికి తోడు ప్రచండగాలులు తోడై విలయం తప్పదంటోంది. ఇదిలావుంటే.. ఫైలిన్ సైజు మరీ ఏమంత భారీస్థాయిలో లేదని, అది క్రమేపీ బలహీనపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ రాథోడ్ అంటున్నారు

  • Loading...

More Telugu News