: సమాచార హక్కు పరుగులు
సమాచార హక్కు ఆయుధం ప్రజల చేతికి అంది ఎనిమిదేళ్లు పూర్తయింది. ఏటేటా దీని వినియోగం పెరుగుతుండడం హర్షణీయం. 2011-12లో దేశవ్యాప్తంగా సమాచార హక్కు అస్త్రాన్ని 40 లక్షల మంది వినియోగించుకున్నారు. 10శాతం లోపు మంది సమాచారం పొందే విషయంలో అధికారుల తిరస్కరణకు గురయ్యారు. జనాభా తక్కువగా ఉండే మిజోరాం, మేఘాలయలో తిరస్కరణ శాతం 1 శాతం లోపే ఉంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో 2.93 లక్షల దరఖాస్తులు సమాచారం కోసం రాగా, తిరస్కరించినవి కేవలం 0.3 శాతంగానే ఉన్నాయి.