: 73 తుపానుల్లో అక్టోబర్ లోనే 30 తుపానులు
రాష్ట్రంలో 1891 నుంచి 2012 వరకు మొత్తం 73 తుపానులు సంభవించాయి. ఈ 73 తుపాన్లలో అక్టోబర్ నెలలో సంభవించిన తుపానులు 30 ఉన్నాయి. నవంబర్ లో 19 తుపానులు రాగా సెప్టెంబర్ లో ఎనిమిది, జూన్ లో మూడు, డిసెంబర్ లో మూడు, జూలైలో ఓసారి తుపాను వచ్చింది. వీటిల్లో 23 తుపానులు నెల్లూరు జిల్లాలో తీరాన్ని తాకగా, 15 కృష్ణాజిల్లాలో తీరాన్ని తాకాయి. మరో 11 తూర్పుగోదావరి జిల్లాలో, ఇంకో పది శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని దాటాయి. విశాఖపట్నం జిల్లాలో ఏడు తుపానులు తీరం తాకితే, ప్రకాశం జిల్లాలో ఐదు తుపానులు తీరం దాటాయి.