: రక్షించే చెట్లు లేక వణుకుతున్న ఒడిశా వాసులు
పైలిన్ ఇప్పుడు ఒడిశాలోని తీర ప్రాంత వాసులను వణికిస్తోంది. ముఖ్యంగా జగత్ సింగ్ పూర్ జిల్లా వాసులైతే బెదిరిపోతున్నారు. దీనికి కారణం అక్కడి పాలకులే. పోస్కో స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం లక్షా డెబ్బై వేల చెట్లను నేలకూల్చింది. ఇవన్నీ తుపాను సమయాల్లో సమీప తీర ప్రాంత వాసులకు రక్షణగా నిలిచేవి. పెను తుపాను సమయంలో వచ్చే బలమైన గాలులను సైతం ఇవి తట్టుకుని నిలబడడమే కాకుండా గాలుల తీవ్రత నేరుగా ప్రజలపై పడకుండా తగ్గించి వేస్తాయి. కానీ, స్టీల్ ప్లాంట్ కోసం బంగారంలాంటి చెట్లను తొలగించడంతో సమీప తీర ప్రాంతాల్లోని ప్రజలు పైలిన్ వల్ల రాబోయే ప్రళయాన్ని తలచుకుని వణికిపోతున్నారు.