: పాట్నా సభకు అద్వానీ దూరం


బీహార్ లో ఈ నెల 27న బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ హాజరుకావడం లేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(జేడీయూ)తో బీజేపీ బంధాలు దెబ్బతిన్న తరువాత, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మరో వైపు జేడీయూతో సంబంధాలు బెడిసికొట్టినా అద్వానీ, నితీష్ ల మధ్య సాన్నిహిత్యం మాత్రం కొనసాగుతోంది. దాని వల్లే అద్వానీ ఈ సభకు హాజరు కావడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, పార్టీ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది. రానున్న ఎన్నికల్లోపు జరగనున్న వంద బహిరంగ సభలకు అందరు అగ్రనేతలు హాజరు కాలేరని, అలాగే అద్వానీ కూడా ఈ సభకు మాత్రమే హాజరుకావడం లేదని బీజేపీ స్పష్టం చేస్తోంది. మరోపక్క మూడో కూటమికి అవకాశం లేదని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఎన్డీయే మిత్రులు మళ్లీ తమతో జట్టుకడతారన్న ఆశాభావం ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News