: విశాఖ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రఘువీరా
రెవెన్యూశాఖా మంత్రి రఘువీరారెడ్డి ఈ తెల్లవారుజామున విశాఖపట్టణం చేరుకున్నారు. ఫైలిన్ తీవ్ర రూపం దాల్చి, ఈ సాయంత్రం తీరాన్ని తాకనుండడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు తీరని నష్టాన్ని కలిగించనుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో నష్టతీవ్రతను తగ్గించేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సహాయక చర్యలను అధికారులతో పాటు స్వయంగా మంత్రి రఘువీరా మూడు రోజుల పాటు పర్యవేక్షించనున్నారు. ఆర్మీ, నేవీ దళాలు గస్తీ నిర్వహిస్తుండగా వైమానికి దళ సహాయం కూడా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరో వైపు విపత్తునివారణాధికారులు, ప్రభుత్వోద్యోగులు ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు.