: పూరీలో పర్యాటకులు ఖాళీ
ఒడిశాలో రెండు ముఖ్య పర్యాటక ప్రాంతాలైన గోపాల్ పూర్, పూరీలకు ఫైలిన్ తాకిడి తగిలింది. ఫైలిన్ ప్రమాదం ముంచుకొస్తుండడంతో ఒడిశా అధికారులు విపత్తు నివారణ చర్యలు చేపట్టారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్న పూరీ, గోపాల్ పూర్ నుంచి పర్యాటకులను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాలను గంజాం కలెక్టర్ కృష్ణకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.