: తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు
ఫైలిన్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఫైలిన్ తుపాను నేపధ్యంలో జిల్లా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జిల్లాలో మొత్తం 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం వరకు ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.