: ధోనీతో బ్రాండ్ అంబాసిడర్ గా కుర్ర క్రికెటర్


ఉన్ముక్త్ చంద్..అండర్- 19 క్రికెట్ ప్రపంచ కప్ విజేత అయిన భారత్ జట్టుకు సారధ్యం వహించిన ఈ కుర్రాడు.. ఇపుడు మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్ అంబాసిడర్లలో ఒకడిగా మారాడు. క్రికెటర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేసుకొని తన బ్రాండ్ ను ఎప్పుడూ నిలుపుకోవాలని ప్రయత్నించే శీతల పానీయ సంస్థ పెప్సీ ...తన తాజా యాడ్ లో ఉన్ముక్త్ చంద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకుంది. 

భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కొహ్లీ, సురేష్ రైనాలతో కలిసి ఉన్ముక్త్ ఈ కమర్షియల్ అడ్వర్టైజ్ మెంటులో నటించాడు. ధోనీతో కలిసి నటించడం తన జీవితంలో మరువలేని అనుభూతిని మిగిల్చిందంటున్నాడు ఈ ఢిల్లీ కుర్ర క్రికెటర్. 

  • Loading...

More Telugu News