: విశ్వంలో మరోచోట కూడా నీరుంది!
విశ్వంలో నీటిజాడలు ఒక్క భూమిపైనే ఉన్నాయి. ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించిన మరే ఇతర గ్రహాలపైనా నీటి జాడలను కనుగొనిందిలేదు. తాజాగా అంతరిక్షంలో సుదూరంగా ఉన్న ఒక చిన్న గ్రహంలో నీటి జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం మన భూమికి చాలా దూరంలో, ఒక బుల్లి నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వార్‌విక్, కేంబ్రిడ్జ్ వర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు భూమికి 170 కాంతి సంవత్సరాల దూరంలో నీటితో ఉన్న గ్రహశకలాలను గుర్తించారు. అక్కడ అంత్య దశలో ఉన్న ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఉన్న ధూళిని, రాతి అవశేషాలను గుర్తించి, వాటి రసాయనిక లక్షణాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ అవశేషాలు ఒక గ్రహానికి సంబంధించినవనీ, ఈ గ్రహం ద్రవ్యరాశిలో 26 శాతం నీరు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.