: కాంగ్రెస్ లో రబ్బర్ స్టాంపు నేతలకు స్థానం లేదు: రాహుల్ గాంధీ


కాంగ్రెస్ పార్టీలో రబ్బరు స్టాంపు నేతలకు స్థానంలేదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ముంబయిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తిలక్ భవన్లో కార్యకర్తలతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్టీలో పని చేసేవారికే పదవులని..పనిచేయని వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వబడవని స్పష్టం చేశారు. మహారాష్ట్ర తరపున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ మోహన్ ప్రకాశ్ పై, అలాగే ఇతర నేతలపై కార్యకర్తల ఫిర్యాదుపై రాహుల్ ఇలా స్పందించారు.

  • Loading...

More Telugu News