: మద్యం మత్తులో యువతి గొంతు కోసిన దుండగుడు
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కత్తితో దాడి చేసి యువతి గొంతు కోశాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ఈ యువతి స్వగ్రామమైన మాచారెడ్డి మండలం భవాని పేటకు వెళ్ళడానికి బస్సు కోసం కామారెడ్డి కొత్త బస్టాండు ప్లాట్ పాం పై ఎదురు చూస్తుండగా ఈ దారుణం జరిగింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.