: 'ఫైలిన్' ధాటికి 24 రైళ్లు రద్దు
ఫైలిన్ తుపాను తీవ్ర రూపంలో తీరాన్ని దాటనుండడంతో రైల్వే శాఖ విపత్తు నివారణ చర్యలు చేపట్టింది. విశాఖపట్నం మీదుగా ఒడిశా వైపు వెళ్లే 24 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా వీచే పెను గాలులకు విద్యుత్, టెలిఫోన్, రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రతీరంలో నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి.