: దుర్గామాతకు 55 లక్షల రూపాయల నోట్లతో అలంకరణ
శరన్నవరాత్రి ఉత్సవాలతో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని మారుతీనగర్ వద్ద నవదుర్గా యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈ రోజు ధనలక్ష్మీ అవతారంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని 55 లక్షల రూపాయల విలువ గల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు.