: హిమాచల్ లో అకాడెమీ ప్రారంభించనున్న హర్భజన్


ప్రఖ్యాత స్పిన్నర్ హర్భజన్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ లో క్రికెట్ అకాడెమీ ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. ఈ అకాడెమీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తుందని భజ్జీ అన్నాడు. ఇప్పటికే భజ్జీకి జలంధర్ లో 'హర్భజన్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్' పేరుతో ఒక అకాడెమీ ఉంది. హిమాచల్ లో క్రికెట్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తాజా అకాడెమీని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించాడు. అయితే, హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే యువరాజ్ సింగ్ నెలకొల్పిన అకాడెమీ యువ క్రికెటర్లను సానబట్టే పనిలో ఉంది.

  • Loading...

More Telugu News