: ఆసుపత్రిలో కొనసాగుతున్న బాబు దీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలోని ఏపీ భవన్ లో దీక్ష చేస్తున్న చంద్రబాబుని పోలీసులు ఈ రోజు సాయంత్రం బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.