: బాబు ఆసుపత్రికి తరలింపు
టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీలోని ఏపీభవన్ నుంచి తీవ్ర ఉద్రిక్తత నడుమ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. కొద్ది సేపటి క్రితం బాబు దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించే యత్నంలో టీడీపీ కార్యకర్తల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఏపీ భవన్ ప్రధాన ద్వారం వద్ద పెద్ద సంఖ్యలో బైఠాయించిన కార్యకర్తలు పోలీసుల సహనానికి పరీక్ష పెట్టారు. అయితే, వారిని చెదరగొట్టిన పోలీసులు బాబును ఆసుపత్రికి తరలించారు.