: సచిన్ ను పీలే, ఫెదరర్ లతో పోల్చిన ఇంగ్లిష్ మీడియా
200వ టెస్టు అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెబుతానని భారత బ్యాటింగ్ కింగ్ సచిన్ టెండూల్కర్ ప్రకటించడం పట్ల ఇంగ్లిష్ మీడియా విశేషంగా స్పందించింది. ప్రముఖ పత్రికలన్నీ సచిన్ కు నీరాజనాలర్పించాయి. ఈ ముంబై వాలాను ఓ సూపర్ హీరోగా అభివర్ణించాయి. అంతేగాకుండా.. బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే, స్విస్ టెన్నిస్ కెరటం రోజర్ ఫెదరర్ లతో పోల్చుతూ ఆకాశానికెత్తేశాయి. ప్రఖ్యాత టైమ్స్ పత్రిక.. సచిన్ ను 'సూపర్ హ్యూమన్' అని పేర్కొనగా, 'మిర్రర్' టాబ్లాయిడ్ సచిన్ ను ఇతర క్రీడల్లో దిగ్గజాలతో పోల్చింది. ఇక వంద కోట్ల మంది ప్రజలను ఆకాంక్షలను మోయడం అనితరసాధ్యమని ప్రఖ్యాత 'గార్డియన్' కొనియాడింది. 'గ్లోబల్ సూపర్ స్టార్' అని స్కై స్పోర్ట్స్ చానల్ అభివర్ణించింది.