: బాబ్లీ విషయంలో బాబును విమర్శించడం తగదు: ఎర్రబెల్లి
బాబ్లీ అంశంలో చంద్రబాబుపై పలువురు నేతలు విమర్శలు చేయడాన్నిటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఖండించారు. ఈ విషయంలో బాబు తీవ్ర పోరాటం చేశారన్నారు. ఆయనను విమర్శించడం తగదని హితవు పలికారు.
బాబ్లీపై అవగాహన లేకుండానే పీసీసీ చీఫ్ బొత్స మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. మరోవైపు గోదావరి నదిపై చెక్ డ్యాం పేరుతో మహారాష్ట్ర 13 అక్రమ జలాశయాలు నిర్మించిందని ఆయన ఆరోపించారు.