: అశోక్ బాబుకు పొన్నం వార్నింగ్


ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ బాబు స్థాయిని మించి మాట్లాడడం కట్టిపెట్టాలని హెచ్చరించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అశోక్ బాబు ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సీఎం వ్యవహారశైలిపైనా పొన్నం విరుచుకుపడ్డారు. సీఎం కిరణ్ కరడుగట్టిన ప్రజాస్వామ్య వ్యతిరేకిలా తయారయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇక, ఢిల్లీలో చంద్రబాబు దీక్షను తెలుగు తమ్ముళ్ళే విరమింపజేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News