: నాజూకు నడుమే అందం.. ఆరోగ్యం!


నోరూరించే ప్రతీ వస్తువునూ లాగించేసే అలవాటుందా? తిండి విషయంలో నోరు కట్టేసుకునే అలవాటు మీకు లేకుంటే ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ తీసుకోక తప్పదు మరి.

నాజూకు నడుము ఆడవారికి ఎంతో అందాన్నిస్తుంది. మగవారికీ నడుము మంచి ఆకారంలో ఉండడం అవసరం. మరి, అలా కాకుండా నడుము సైజు బాగా పెరిగితే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అంతేకాదండీ.. మీ నడుమే మీ అనారోగ్యాన్ని ఎత్తి చూపుతుంది. 

మగవారి నడుము చుట్టు కొలత 94 సెంటీమీటర్లు, ఆడవారి నడుము చుట్టుకొలత 80 సెంటీమీటర్ల వరకు ఉంటే నో ప్రాబ్లం. కానీ, ఇంతకు మించి ఉందంటే మాత్రం మీరు స్థూలకాయంలోకి వెళుతున్నట్లే. ఫలితంగా ఎన్నో వ్యాధులు అతిధుల్లా వచ్చి మీ దేహంలో తిష్ట వేస్తాయి. 

ఆరోగ్య పరీక్ష- 7
ప్రతీ ఆరు నెలలకోసారి మీ బరువు, నడుము ఆకారాన్ని పరీక్షించుకోవాలని వైద్యుల సూచన. ఈ ఎత్తు, బరువు నిష్పత్తినే బీఎంఐ అంటారు. ఇది ఆరోగ్య సూచికలాంటిది. దీనిని పరీక్షించుకోవడం ద్వారా శరీర బరువును అదుపులో పెట్టుకోవచ్చు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ, వ్యాయామానికి దూరంగా ఉన్నవారికే శరీర బరువు పెరిగిపోతుంటుంది. అధిక కొవ్వంతా వచ్చి నడుము భాగంలో పేరుకుపోతూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. 

  • Loading...

More Telugu News