: 'రామయ్య'కు తెలంగాణ సెగ
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' చిత్రానికి తెలంగాణ సెగ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ లో ఈ సినిమా వెంకటేశ్వర థియేటర్లో ప్రదర్శితమవ్వాల్సి ఉంది. అయితే, తెలంగాణ వాదులు ఈ ఉదయం సినిమా హాలు వద్ద ఆందోళన చేసి పోస్టర్లను దగ్ధం చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రదర్శనను థియేటర్ యాజమాన్యం నిలిపివేసింది.