: మారన్ పై చార్జిషీటు వేసేందుకు సిద్ధమైన సీబీఐ


వివాదాస్పద 'ఎయిర్ సెల్-మాక్సిస్' ఒప్పందంలో మాజీ టెలికాం మినిస్టర్ దయానిధి మారన్ పై చార్జిషీటు వేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సిద్ధమైంది. ఇందుకు సంబంధించి చేస్తున్న దర్యాప్తులో కొంత మేరకు ఆధారాలు సేకరించిన సీబీఐ ఇక ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టుకు అభియోగపత్రాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మలేసియాకు చెందిన మాక్సిస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మారన్, ఆయన సోదరుడు కళానిధి రూ.549 కోట్లు పుచ్చుకున్నారని ఇప్పటికే దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే, మారన్ మాత్రం ఇవన్నీ ఆరోపణలంటూ తోసిపుచ్చారు. ఇదిలావుంటే, ఇంకా మాక్సిస్ సంస్థ నుంచి పూర్తి సమాచారం రాలేదని, దానికోసమే తాము ఎదురుచూస్తున్నట్లు న్యాయస్థానానికి దర్యాప్తు అధికారులు తెలపనున్నారని సమాచారం. గత సంవత్సరం నుంచి ఈ దర్యాప్తు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News