: ఏపీ భవన్ ఖాళీ చేయాలని బాబుకు మరోసారి నోటీసులు
ఢిల్లీలో నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ భవన్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీక్షా స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు రాజధానిలో నిన్న బాగా వర్షం కురవడంతో బాబు దీక్షా శిబిరం తడిసి ముద్దయింది.