: నేడే నోబెల్ శాంతి పురస్కార ప్రకటన


శాంతి కోసం విశేష కృషి సల్పిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం నోబెల్ అవార్డును నేడు జ్యూరీ ప్రకటించనుంది. ఈ అవార్డు కోసం ఈసారి 259 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 50 సంస్థలు కూడా ఉన్నాయి. పాక్ లో బాలికల విద్యా హక్కు ఉద్యమకారిణిగా మారిన మలాలా యూసఫ్ జాయ్(16) కూడా ప్రధాన పోటీదారులలో ఒకరు. ఒకవేళ మలాలాను అవార్డు వరిస్తే ప్రపంచంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న పిన్న వయస్కురాలిగా రికార్డులకు ఎక్కుతుంది. కాంగోకు చెందిన సర్జన్ డాక్టర్ డెనిస్ ముక్ వెగే కూడా పోటీదారులలో ఒకరు. ఈమె బుకావోలో తన ఆసుపత్రిలో వేలాది మంది అత్యాచార బాధితురాళ్లకు వైద్యసేవలు అందించారు. చిన్నారుల కోసం సేవాసంస్థ నిర్వహిస్తున్న ఈజిప్ట్ వాసి సిస్టర్ మేగీగోబ్రాన్, రష్యా మానవహక్కుల కార్యకర్తలు కూడా అవార్డు కోసం పోటీ పడుతున్నారు.

  • Loading...

More Telugu News