: భారీ వర్షంతో తడిసి ముద్దయిన చంద్రబాబు దీక్షా శిబిరం
ఢిల్లీలో ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షంతో... చంద్రబాబు దీక్ష చేస్తున్న వేదిక తడిసి ముద్దయింది. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ టీడీపీ అధినేత చేస్తున్న దీక్ష నేటితో ఐదో రోజుకు చేరుకుంది. చంద్రబాబు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈ ఉదయం విజయవాడ నుంచి దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు ప్రత్యేక రైలులో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.