: రక్తహీనతను ఇలా తరిమికొట్టండి


మనదేశంలోని మహిళల్లో రక్తహీనత సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. చాలామంది మహిళలు రక్తహీనత కారణంగా మరణిస్తున్నట్టు ఇటీవలే పలు సర్వేలు వెల్లడించాయి. రక్తహీనత ఉన్నవారు చక్కగా మన ఆహారంలో చిన్నపాటి మార్పులను చేసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలతోబాటు రక్తవృద్ధి కూడా ఉంటుంది. శరీరానికి కావలసిన పోషకాలను ఎక్కువగా అందించే వాటిలో ముందుగా చెప్పుకోదగ్గదీ, కాస్త చవకగా దొరికేది ఖర్జూరం.

ఖర్జూరాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీని రుచి కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన సల్ఫర్‌, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌, మాంగనీసు, కాపర్‌ మెగ్నీషియం వంటి పలు రకాలైన ఖనిజాలు ఉంటాయి. ఇందులో చెడు కొలెస్టరాల్‌ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం రోజూ తీసుకునే ఆహారంలో కొంతభాగంగా ఖర్జూరాలను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఖర్జూరంలో సహజసిద్ధంగా లభించే చక్కెరలు, గ్లూకోజ్‌ వంటివాటివల్ల వాటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. కొద్దిసేపటికే తక్షణ శక్తి మనకు అందుతుంది. నీరసం దూరమవుతుంది. ఇందులో పొటాషియం ఎక్కువగాను, సోడియం తక్కువగాను ఉంటుంది. అందువల్ల వీటిని తినడం వల్ల నరాల వ్యవస్ధ దృఢంగా మారుతుంది. రక్తహీనతతో బాధపడే మహిళలు రోజుకు రెండు, మూడు ఖర్జూరాలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

  • Loading...

More Telugu News