: సీమాంధ్ర ఉపాధ్యాయులతో సీఎం చర్చలు సఫలం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర అధ్యాపక సంయుక్త కార్యాచరణ సమితి ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సీమాంధ్ర ఉపాధ్యాయులు సమ్మె విరమించడానికి అంగీకరించినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు పూర్తి స్థాయిలో తమ వంతు యత్నాలను చేస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన వివరించారు. రేపటి నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరుకానున్నట్టు మంత్రి తెలియజేశారు.