: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ నేత పెద్దిరెడ్డి సవాల్


వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ నేత పెద్దిరెడ్డి సవాలు విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాష్ట్ర గవర్నర్ ముందుకు తీసుకురావాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. టీడీపీ అవిశ్వాసం పెట్టినంత మాత్రాన రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోదని పెద్దిరెడ్డి అన్నారు.

అవిశ్వాసంపై కనీస అవగాహన కూడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకో..లేక ఓటమి భయంతోనో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పెద్దిరెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News