: సచిన్ కు శ్రీనివాసన్ నీరాజనం


కెట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ నీరాజనాలు అర్పించారు. ప్రపంచ క్రీడారంగంలో సచిన్ ధ్రువతార అని కొనియాడారు. శ్రీనివాసన్ మీడియాతో మాట్లాడుతూ, సచిన్ కెరీర్ తొలినాళ్ళలో చెన్నైలో దేశవాళీ క్రికెట్ ఆడడానికి వచ్చినప్పటి నుంచి అతనికి అభిమానినయ్యానని తెలిపారు. భారత క్రికెటర్లలో కెల్లా సచినే అగ్రగామి అనడంలో సందేహం లేదన్నారు.

సచిన్ లా భారత క్రికెట్ కు సేవలందించిన వ్యక్తి మరొకరు లేరన్నారు. క్రికెటర్లకే కాకుండా ఇతర క్రీడలకు చెందిన వారికీ సచిన్ స్ఫూర్తిగా నిలుస్తాడని పేర్కొన్నారు. రిటైరవ్వాలన్న సచిన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని, అయితే, అతను లేని జట్టును ఊహించలేమని అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం సచిన్ తనకో మెయిల్ పంపాడని, దాని ఆధారంగానే తాము రిటైర్మెంటు ప్రకటనను మీడియాకు విడుదల చేశామని శ్రీనివాసన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News