: తెలంగాణకు ప్రత్యేక పీసీసీ కావాలి: తెలంగాణ ఎమ్మెల్సీలు
తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. హైదరాబాదులో భేటీ అయిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు సత్వరమే పీసీసీని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రుల బృందానికి చెప్పాల్సిన అంశాలపై ఓ ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్టు వారు వెల్లడించారు.