: కోస్తా జిల్లాలకు పెనుగండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫైలిన్ తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఉత్తరకోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాను ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఎల్లుండి ఒడిశాలోని పరదీప్-కళింగపట్నం మధ్య తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.