: కోర్టునుంచి ఆదేశాలు తీసుకొస్తే బాబు దీక్షను అడ్డుకుంటాం: షిండే


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దీక్షను ఆపేందుకు సహకరించాలన్న ఏపీభవన్ కార్యదర్శి విజ్ఞప్తిని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తిరస్కరించారు. చంద్రబాబును తరలించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కోర్టును ఆశ్రయించాలని, కోర్టు ఆదేశిస్తే తాము సహకరిస్తామని షిండే స్పష్టం చేశారు. రాష్ట్ర అతిథి గృహంలో ఓ మాజీ ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేయడాన్ని తాను తొలిసారి చూస్తున్నానని షిండే వ్యాఖ్యానించారు. బాబు దీక్ష విరమించి స్వరాష్ట్రానికి వెళ్లాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News