: రాహుల్ ప్రధాని కావడమే నా కోరిక: షిండే
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడమే తన బలమైన కోరికని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తన శాఖ నెలవారీ సమీక్షలో భాగంగా ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ సహా పలువురు ప్రధాని పదవికి రాహుల్ పేరును బహిరంగంగానే ప్రతిపాదిస్తూ వచ్చారు. అయితే, యూపీఏ, కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు.