: హైకోర్టు పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు
హైకోర్టు పరిసర ప్రాంతాల్లో నేటినుంచి నిషేధాజ్ఞలు విధించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, నిర్వహించ వద్దని హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 8 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కాలేజ్ కూడలి నుంచి నయాపూల్ రోడ్డు, మదీనా సర్కిల్ నుంచి సిటీ కాలేజ్ రోడ్డు, గన్సీ బజార్ పరిసర ప్రాంతాలు, నయాపూల్ నుంచి మదీనా సర్కిల్ మీదుగా హైకోర్టు రోడ్డులో, ముస్లిం జంగ్ వంతెన కూడలి నుంచి హైకోర్టు రోడ్డులో ఈ నిషేధాజ్ఞలు అమలవుతాయి.