: వాగులో ఇద్దరు బాలికలు గల్లంతు
వాగు దాటుతుండగా ప్రవాహ తీవ్రతకు ఇద్దరు బాలికలు కొట్టుకుపోయారు. ఈ ఘటన కృష్ణాజిల్లా అగిరిపల్లి మండలంలో జరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కుంపెని వాగు భీకరంగా ప్రవహిస్తోంది. కాగా, కొట్టుకుపోతున్న చిన్నారులను రక్షించడానికి అక్కడ చేపలు పడుతున్న వారు విశ్వప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తహశీల్దారు కె.రవిశంకర్, డీఎస్పీ శంకర్ రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్ లు గాలింపు చర్యలు చేపట్టారు.