: ఏపీ భవన్ ఆంధ్రాభవన్ గా మారింది: దేవీప్రసాద్
ఢిల్లీలోని ఏపీ భవన్ ఆంధ్రా భవన్ గా మారిపోయిందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. ఏపీ భవన్లో చంద్రబాబు చేస్తున్న దీక్ష ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. రాష్ట్రంలోని పరిపాలనకు పక్షవాతం వచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వర్గ కమిటీ అస్పష్టంగా ఉందని... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక నిర్దిష్టమైన గడువు విధించాలని కోరారు.