: మంత్రి ఆనం ఇంటి ముట్టడికి యత్నం
సమైక్యాంధ్ర ఉద్యమకారులు నెల్లూరులో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ రోజు ఉదయం స్థానిక బోసుబొమ్మ సెంటర్ లోని ఏబీఎమ్ కాంపౌండ్ నుంచి ఎన్జీవోలు, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, విద్యార్థి జేఏసీ, హిజ్రా సంఘాలు మంత్రి నివాసం ముట్టడికి బయలుదేరాయి. మార్గమధ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు, ఏఆర్ సిబ్బంది.. అంతా కలిపి దాదాపు 300 మంది ఆనం ఇంటికి కాపలాగా ఉన్నారు. మంత్రి ఇంటి చుట్టూ కంచె ఏర్పాటుచేసి ముట్టడికి వచ్చే వారిని అరెస్టు చేస్తున్నారు.