: సరస్వతిదేవిగా బెజవాడ దుర్గమ్మ


బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి శరన్నవరాత్రులు ఆరవరోజుకు చేరాయి. ఈ రోజు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు తిరుమలేశుడు వేంకటాద్రి రాముడుగా హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. స్వామివారి హనుమంత వాహన సేవను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

  • Loading...

More Telugu News