: ఊళ్ళోకొచ్చిన ఎలుగుబంటి.. హడలెత్తిన ప్రజలు


ఇటీవల కాలంలో వన్యప్రాణులు అరణ్యాలను వదిలి జనారణ్యాల్లోకి రావడం పరిపాటిగా మారింది. అడవులను విచక్షణా రహితంగా కొట్టివేయడమే ఇందుకు కారణమని పర్యావరణ ఉద్యమకారులు గగ్గోలు పెడుతున్నా.. ప్రజలకు, ప్రభుత్వాలకు తలకెక్కడంలేదు. తాజాగా, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం వెంకట్రావు పల్లెలో ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. సమీప అటవీప్రాంతం నుంచి గ్రామంలో ప్రవేశించిన ఆ ఎలుగుబంటి ఓ చెట్టెక్కింది. అది ఎంతకీ దిగకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అటవీశాఖాధికారులకు, రెస్క్యూ టీంకు సమాచారమందించారు.

  • Loading...

More Telugu News