: రద్దీ దృష్ట్యా నాలుగు వేల ప్రత్యేక రైళ్లు
పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలోని 38 రద్దీ ప్రాంతాలకు నాలుగు వేల ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.