: నిమ్స్ లో కొనసాగుతున్న జగన్ దీక్ష.. విజయమ్మ పరామర్శ
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తన నిరాహార దీక్షను నిమ్స్ ఆసుపత్రిలోనూ కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి లోటస్ పాండ్ లో జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అయితే, ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని సమాచారం. ఈ ఉదయం వైఎస్సార్సీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నిమ్స్ ఆసుపత్రిలో కుమారుడిని పరామర్శించారు. ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని వైద్యులు ఆమెకు తెలిపారు.