: కిరణ్... తెలంగాణపై నిర్ణయంతో తిరిగి..రా!: నారాయణ
డిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి స్పష్టమైన నిర్ణయంతో తిరిగి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ వైఖరిని అయన తప్పు పట్టారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి తెలిసి కూడా తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిని డిల్లీ చుట్టూ తిప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కిరణ్ కుమార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా అధిష్ఠానం నౌకరులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.